SIR కార్యక్రమంలో ప్రతి అర్హుడూ పాల్గొనాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూలై 10 (7 టీవీ ఫోకస్): ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర, పకడ్బందీ ఓటరు జాబితా రూపుదిద్దుకుంటుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రతి అర్హుడూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అవగాహన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125వ డివిజన్ గాజులరామారం మంజూర్ బస్తీలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటు విలువైనదని, ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పౌరుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఓటరు జాబితాలో తన పేరు సరిగా నమోదైందో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు కూడా తమ అర్హతల ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉండటం ప్రజలకు ఉపయోగకరమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డీసీ వెంకటరాములు, డీఈ అనురాగ్ మహాదేవ్, సూపరింటెండెంట్ బాలకృష్ణ, బీఎల్ఓలు, బీఎల్ఏలు, డివిజన్ అధ్యక్షుడు విజయ్‌రామ్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, మూసా ఖాన్, చెట్ల వెంకటేష్, తెలంగాణ సాయి, బోయిని మహేష్, నవీన్ దుండుగుల, ప్రసాద్, వేణు సాదుల, శివనాయక్, హమీద్, షేక్ సాజిద్, రాములు గౌడ్, సంగమేష్, భాస్కర్ ముదిరాజ్ తదితరులతో పాటు మంజూర్ బస్తి ప్రజలు పాల్గొన్నారు.

