న్యూఢిల్లీ 7tv focus : ప్రధాని నరేంద్ర మోదీఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు భారతీయ జనతా పార్టీ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ ప్రచారాన్ని చేపట్టింది. మోదీ ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ఆయన పుట్టిన రోజు కాగా, ఇక అక్టోబర్‌లో ఆయన ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండనున్నాయి.
మోదీ జన్మదినం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శివసేనా ప్రెసిడెంట్ ఏకనాథ్ షిండే, ఎల్జీపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్‌తో పాటు మూడు చోట్ల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వారాణాసిలో చంద్రబాబు, పాశ్వాన్ పాల్గొంటారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మోదీ ఆరోగ్యాన్ని కోరుకుంటూ పూజలు చేయనున్నారు. వారాణాసిలో సుమారు 51 మంది బైకర్లు గంగా నదిలో నీటిని తీసుకుని కాశీ విశ్వనాథ్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని వాద్నగర్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గోననున్నారు.
వాద్‌నగర్‌లోనే మోదీ జన్మించారు. సిటీలో ఉన్న జగన్నాథ్ టెంపుల్లో షా పూజలు చేయనున్నారు. షిండేతో పాటు అనుప్రియా పాటిల్ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఉజ్జెయినిలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ ప్రత్యక పూజలు చేయనున్నారు. ఢిల్లీలో రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించనున్నారు. 1950, సెప్టెంబర్ 17వ తేదీన వాద్నగర్లో మోదీ జన్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని ఆయనే కావడం విశేషం. ఇక గుజరాత్ సీఎం ఆయన 2001, అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన ప్రజాజీవితానికి 25 ఏళ్లు పూర్తి కానున్నాయి.

