7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు కాసం వెంకటేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు కాసం వెంకటేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. రామ్‌చందర్ రావు శేఖర్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడ్చల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావుల శేషగిరిరావు, మేకల సురేష్ రెడ్డి, సిద్ధిరామిరెడ్డి, యాదగిరి యాదవ్, సుబ్బారావు, మల్లేష్, ఆర్తిక్ యాదవ్, గండి రాజు యాదవ్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

