7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు చూస్తే ఆయన మానసిక స్దితిపై అక్కడక్కడా చర్చలు జరిగేవి. కానీ ఇవాళ ఆయన పెట్టిన ఓ ట్వీట్ చూస్తే నిజంగానే ఈ అనుమానాలు నిజమే అనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన భారత్ లో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొంటూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఈ ట్వీట్ చేశారు.”భారత అధ్యక్ష ఎన్నికల మొదటి విడతలో ఈ రోజు 12.5 కోట్ల మంది ఓటు వేశారు. ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే, అదే రోజున ఫలితాలు వెలువడ్డాయి,” అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేసారు. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో అసలు అధ్యక్ష ఎన్నికలు నేరుగా జరగవు. అలాంటి అధ్యక్ష ఎన్నికలు జరిగాయని, 12.5 కోట్ల మంది ఓటు కూడా వేశారంటూ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మాట ఎవరో ఓ అనామకుడు చెప్తే అది వేరు. కానీ ప్రపంచ పెద్దన్న గా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేయడం షాకింగ్ గా ఉంది. డీజిల్ ధరలు మండుతున్న వేళ ట్రంప్ కీలక ప్రకటన! ఇంతకీ దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ తన తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న నేపథ్యంలో. ట్రంప్ బ్రెజిల్ కు బదులు భారత్ ను ప్రస్తావిస్తూ ఇలా పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కానీ భారతదేశంలో ఇవాళ అసలు ఏ ఎన్నికలూ జరగడం లేదు, ఇక అధ్యక్ష ఎన్నికలు జరగడం అనేది అసంభవం. అంతేకాకుండా, భారతదేశంలో అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్షంగా జరగవు, అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు, కానీ వారిచే ఎన్నుకోబడిన ప్రతినిధులు నాయకుడిని ఎన్నుకుంటారు. దీంతో ట్రంప్ పెట్టిన పోస్టుపై అమెరికన్లు సైతం చర్చించుకుంటున్నారు.

