7tv focus : మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం దర్శించుకున్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, జోన్-5 ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి వారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.ముందుగా మంత్రాలయం గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించారు. కర్నూలు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

