7 టీవీ ఫోకస్ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా చెందిన వారు
రాజేంద్రనగర్, జులై 02, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే మహిళలను టార్గెట్గా చేసుకొని ఉపాధి పేరుతో మోసం చేయడంతో నకిలీ వీసాలతో 20 మంది మహిళలు పట్టు పడడం జరిగింది. వివరాల్లోకెళ్తే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం విదేశీ ఉపాధి పేరుతో మోసం చేసి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు పట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. మస్కట్ కి వెళ్ళేందుకు గురువారం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను వారి దగ్గర ఉన్న వీసాలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలతో బయలుదేరుతున్న వీరిని నిలిపివేశారు. అనంతరం వారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించడం జరిగింది అని తెలిపారు. విచారణలో విదేశీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మించిన ఓ ట్రావెలర్ ఏజెంట్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసినట్లు మహిళలు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రావెల్ ఏజెంట్ తో పాటు ఈ మోసం వెనక ఉన్న నెట్వర్క్ ను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

