చింతలపూడి, జూలై 9 (7 టీవీ ఫోకస్): చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా ఆలకించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చింతలపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచే ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఆయన శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వైఖరిని పలువురు అభినందించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

