7tv focus : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆందోళన జరిగే సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శుక్రవారం రాత్రి 10.00 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 10, శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నారు. దీనిపై సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటన చేశారు. తమ ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ఆందోళనకు అనుమతి ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు.సౌరవ్ దాస్ తమకు దరఖాస్తు చేసుకున్నారని, ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవడం, గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల వారికి అనుమతి ఇవ్వడం లేదని న్యూఢిల్లీ రేంజ్ జాయింట్ కమిషనర్ నుపుర్ ప్రసాద్ తెలిపారు. అయినప్పటికీ, సీజేపీ నేతలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పైగా గత జూలైలో వారు చేపట్టిన ఆందోళన ఎంత హింసాత్మకంగా మారిందో తెలిసిందే.ఈసారి అలాంటి అవకాశం లేకుండా పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి 9.00 గంటల నుంచే మెట్రో రైల్ సేవలు నిలిచిపోనున్నాయి. రాత్రి 10.00 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నారు. ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు. అవసరమైతే ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని సూచించారు. పేరేంట్స్-టీచర్స్ మీటింగ్స్ కూడా రద్దు చేసి, రీ షెడ్యూల్ చేశారు.

