7tv focus : స్థానిక ఎన్నికల పై జగన్ దూకుడు పెంచారు. ఈ ఎన్నికలను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాల వారీగా జగన్ స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమికి ధీటుగా ఎన్నికల్లో పని చేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు. అభ్యర్ధుల ఎంపిక.. సామాజిక సమీకరణాలు.. స్థానికంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష పద్దతిలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు జరగనుండటంతో అనుకూలంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మేయర్ సీటు బరి లో బలమైన అభ్యర్ధిని దింపటం ద్వారా ఎన్నికలో లెక్కలు మారుతాయని.. పార్టీ కోసం పని చేసిన వారికే సీట్లు ఇవ్వాలని జగన్ స్పష్టం చేసారు. స్థానికంగా అందరూ ఏకాభిప్రాయంతోనే అభ్యర్ధిని ఫిక్స్ చేయాలని జగన్ నిర్దేశించారు. జగన్ తొలి సారి, బిగ్ డెసిషన్- వారికే సీట్లు.. కీలక ఆదేశాలు..!! నెల్లూరు మేయర్ అభ్యర్ది ప్రకటన కాగా.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్లుగా అభ్యర్ధుల ఖరారు పైనా జగన్ పార్టీ నేతలతో చర్చలు చేస్తు న్నారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత సీటు ఎవరికి వచ్చినా… అన్ని వర్గాల నుంచి అభ్యర్ధుల పేర్ల తో జాబితాలు సేకరిస్తున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. ఈ కసరత్తులో ఇంఛార్జ్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాంతీయ సమన్వయ కర్తలకు కీలక బాధ్యత లను అప్పగించారు. కాగా.. ఈ ఎన్నికల్లో తొలి అభ్యర్ధిని ప్రకటించారు. నెల్లూరు మేయర్ అభ్యర్ధి గా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని జగన్ ఖరారు చేసారు. ఆయన గతంలో వైసీపీలో కీలకంగా పని చేసారు.

