7tv focus : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై , కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. రేపు (ఆదివారం) జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజు అన్నదమ్ములిద్దరు భారీ కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు (శనివారం) పులివెందులలో మీడియాతో రవి మాట్లాడారు.
విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం..
వైసీపీ వాహనాలు, జగన్ మీడియా లైవ్ వ్యాన్లను వారే దహనం చేసుకునే కుట్రకు పాల్పడుతారని బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి కూటమి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు. పులివెందుల ఆడిటోరియంలో వైసీపీకి సంబంధించిన ఇతర ప్రాంతాల వ్యక్తులు భారీగా చేరుకున్నారని ఆరోపించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేయాలని రవి విజ్ఞప్తి చేశారు

