ఓటర్ల వివరాల నమోదు చేసుకోవాలని పిలుపు
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ సర్కిల్ పరిధిలోని రుడ మేస్త్రి నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), ఎన్నికల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లతో మాట్లాడిన ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి అర్హ ఓటరు ఎన్యూమరేషన్ ఫారంలో వ్యక్తిగత వివరాలను సక్రమంగా నమోదు చేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.
ఈ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత బీఎల్వోలు లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, గుమస్తా మధుసూదన్, వెంకటేష్, బాలకృష్ణ, బలరాం, రఘురెడ్డి, ఆసిఫ్, నరేష్, దత్తు, రజాక్, రాజిరెడ్డి, పాషా, రామకృష్ణ, రామ నరసయ్య, సంతోష్, బీఎల్వోలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

