విజయనగరం 7tv : స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి నేడు కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూ.18 వేల కోట్లతో ఇవాళ (శనివారం) పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. 13 వేల మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం. ఈరోజు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయి. కొత్త ప్రాజెక్టులు ఎయిర్, రోడ్ కనెక్టివిటీని పెంపొందిస్తాయి. చంద్రబాబు, పవన్ నేతృత్వంలో ఏపీలో డబుల్ అభివృద్ధి జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.

