ఇంగ్లండ్ 7TV FOCUS : ఇంగ్లండ్ వెటరన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తమ దేశానికి చెందిన జూనియర్ టీమ్ ఇంగ్లండ్ లయన్స్‌కు కోచింగ్ ఇస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్ తన పదవికి రాజీనామా చేశాడు. రెండేళ్లుగా ఆ జట్టును తీర్చిదిద్దిన ఫ్లింటాఫ్ ఆగస్టు 8, శనివారంతో తన సేవలకు స్వస్తి పలికాడు. ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్‌గా కొనసాగనున్నాడీ దిగ్గజం.మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలోని ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పేసిన అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)లోని జట్లలో ఒకటైన సిడ్నీ థండర్స్ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు.‘లయన్స్ కోచ్‌గా వైదొలగాలని దురదృష్టవశాత్తూ నిర్ణయం తీసుకున్నా. దేశంలోని యువ క్రికెటర్లతో సమయం గడపడం, వారికి శిక్షణ ఇచ్చే అవకాశాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. వారిని మరింత ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నా. తదుపరి సిడ్నీ థండర్స్‌కు ప్రధాన కోచ్‌గా సేవలందించేందుకు నేను ఇక వేచి ఉండలేకపోతున్నా’ అని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) వెల్లడించింది. లయన్స్ హెడ్‌కోచ్‌గా 2004 సెప్టెంబర్‌లో ఫ్లింటాఫ్ బాధ్యతలు చేపట్టాడు.

