పరువునష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సుల్తాన్‌పుర్‌కు బయల్దేరారు. ఆ ప్రయాణంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 10.15 గంటల సమయంలో కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ఓ ప్రైవేటు వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేసింది.
దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కొన్ని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. చివర్లో ఉన్న వాహనాలతో పాటు ఓ అంబులెన్స్ కూడా ఢీకొన్నట్లు సమాచారం. ఆ వాహనాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. కొందరికి గాయాలైనట్లు సమాచారం. అయితే పెద్దగా గాయాలైనట్లు సమాచారం లేదని పోలీసులు తెలిపారు. కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు మధ్యలో వచ్చి చేరాయని, వాటిలో పొరుగున ఉన్న అమేఠీ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తర్‌ప్రదేశ్‌లో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం ఆ ఘటన జరిగింది. అయితే రాహుల్ గాంధీ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.