7tv focus : ఈ సమావేశంలో తదుపరి నిరసనలకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక నివాసాలను ముట్టడించాలని ఇండియా బ్లా్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి నివాసం, సేవా తీర్థ్ వంటి ప్రాంతాల వద్ద భారీ ఎత్తున ధర్నాలకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ విధివిధానాల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఈ ఆందోళనలను ఉమ్మడిగా చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని కూడా ఇండియా కూటమి నిర్ణయించింది. రాష్ట్రపతి భవన్ అపాయింట్మెంట్ సైతం కోరింది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ నుంచే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తోన్నట్లు తెలిపారు. హైఓల్టేజ్ దిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం రాష్ట్రపతిని కలిసే నేతల పేర్లను కూడా రాష్ట్రపతి కార్యాలయానికి సమర్పించామని, అయినప్పటికీ ఈ ఉదయం వరకు కూడా ఎలాంటి అధికారిక స్పందన రాలేదని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్మెంట్ లభించకపోతే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ముందున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసే విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని వ్యాఖ్యానించారు.

