7tv focus : సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్కు రంగం సిద్ధమైంది. బాక్సాఫీసర్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోసొంతం చేసుకుంది. కాగా, నవంబర్ 12 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా వరల్డ్ వైడ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ కూడా సినీ వర్గాల్లో జరుగుతోంది. థియేట్రికల్ రన్‌తో పోలిస్తే ఓటీటీలో రాబోయే వెర్షన్లో దాదాపు 30 నిమిషాల అదనపు ఫుటేజ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మోహన్‌లాల్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి తదితరుల పాత్రలకు సంబంధించిన కొన్ని డిలీటెడ్ సీన్స్ లేదా పొడిగించిన సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో జోడించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.

