కూకట్పల్లి, జూలై 20:
కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ప్రతిమ హాస్పిటల్ – కెపిహెచ్బీ కాలనీ వారి సౌజన్యంతో ఆదివారం కూకట్‌పల్లిలోని వివేక్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువకులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320డి జిల్లా గవర్నర్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.శిబిరంలో పాల్గొన్న ప్రజలకు అనుభవజ్ఞులైన వైద్యులచే సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యులచే నిపుణుల సలహాలు అందించబడాయి. అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ చేసి తగిన చికిత్స సూచించడంతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సేవలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయని పాల్గొన్న వారు తెలిపారు. ఈ సందర్భంగా కూకట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, కోశాధికారి శ్రీనివాస రెడ్డి, క్లబ్ సభ్యులు చెంచు రామిరెడ్డి, శేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ 320డి క్యాబినెట్ సభ్యులు కోటి రెడ్డి, ప్రఫుల్లా రెడ్డి, వివేక్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యపాగ శ్రీనివాస్, అసోసియేషన్ సభ్యులు రవీందర్, అనిల్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. ఉచిత వైద్య శిబిరం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి ఆరోగ్య సేవా శిబిరాలను తరచూ నిర్వహించాలని లయన్స్ క్లబ్‌ను కోరారు.

