- అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్..
7,,టీవీ,, న్యూస్ ఫోకస్,,7/8/2026/
నారాయణపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ డి.ఎల్.ఎస్.ఏ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లామక్తల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా , గిరిజన ప్రాబల్య ప్రాంతాలలోని గిరిజన ప్రజల ప్రయోజనం కోసం , మేము నల్సా ( గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలు ) పథకం , 2015 పై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్ అధ్యక్షత వహించారు. న్యామూర్తి గారు మాట్లాడుతూ ..గిరిజన సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో డిఎల్ఎస్ఏ (DLSA ) పాత్ర ఏమిటి:
ప్రజల సంక్షేమం కోసం అనేక చట్టాలు, పథకాలు ఉన్నాయి. వాటి గురించి ప్రతి పౌరుడికి, ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలి. చట్టాల గురించి తెలియకపోవడం వల్ల చాలామంది తమకు రావాల్సిన హక్కులు, సౌకర్యాలు పొందలేకపోతున్నారు అని అన్నారు. గిరిజనుల ప్రయోజనాల కోసం కేంద్ర న్యాయ సేవా అధికార సంస్థ నల్సా ద్వారా అనేక పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. వీటితో పాటు వృద్ధుల పథకాలు, రైతు సంక్షేమ పథకాలు, కట్న నిషేధ చట్టం, చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ గురించి కూడా గ్రామస్తులకు వివరించారు. వరికైనా చట్టపరమైన సమస్యలు ఉంటే భయపడకుండా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. పేదలు, గిరిజనులు, మహిళలు, దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు.గిరిజన హక్కుల పరిరక్షణ ప్రాముఖ్యత రాజ్యాంగలో అందరికి ప్రధాన హక్కులు :
మానవ హక్కులు, పౌర హక్కులు, వినియోగదారుల హక్కులు, స్త్రీ హక్కులు, బాలల హక్కులు, వైకల్యం హక్కులు, స్వేచ్చ హక్కు, సమాచార హక్కులు, సీనియర్ సిటిజన్ హక్కులు, ట్రాఫికింగ్ హక్కులు, మహిళా హింస, మానవ హక్కులూ సమాన అవకాశాలు కల్పించిందన్ని అన్నారు.న్యాయవాదులు మాట్లాడుతూ..ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలందరు తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. ప్రజలందరు సమానమే ఉన్నవాళ్లు, పేదవాళ్ళు అని తేడా లేదు, పేదరిక నిర్ములనా, భూమి తాగదాలు,ఆస్తి తాగదాలు, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా మరియు వివిధ ప్రభుత్వ పథకాలు, అక్షరాస్యత మరియు చట్టపరమైన అవగాహన మరియు ముఖ్యంగా, సమాజంలోని బలహీన వర్గాలకు హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలు, తమ పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేస్తే పెద్దవారిదే తప్పుగా తల్లితండ్రుల నిర్వహణ ఆడది ఆభాల కాదు ఆదిశక్తి, స్త్రీ మరియు పురుష ఆధిక్యత, వరకట్న వేదింపులు, సఖి సెంటర్, వోల్డీగే హోమ్, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్, వృద్ధుల సమస్యలు ఆర్థిక సమస్యలు, ఉపాధి నష్టం, రైతు చట్టాలు విత్తనాల చట్టం, ఎరువులు పురుగుల మందు చట్టం, వినియోగ దారుల రక్షణ చట్టం, నిత్యావసరాలు సరుకుల చట్టం, దీనికి సంబంధించే డీలర్ గానీ ఇతరులు గానీ బండికి సంబంధించిన లైసెన్స్ ను కలిగి వుండాలి. లేదంటే చట్టం వారిని శిక్షిస్తుంది. ఆదాయ లోపం మరియు ఆర్థిక అభద్రత వంటి సమస్యలు పెద్దల వేధింపుల సమస్యలు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను వృద్ధులు గౌరవంగా మరియు భద్రతతో జీవించగలగాలి మరియు దోపిడీ మరియు మానసిక మరియు శారీరక వేధింపులకు ప్రయోజనాలపై అవగాహన మరియు న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మూడు లక్షల లోపు సంవత్సరాల ఆదాయం కలిగిన బీసీలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయన్నారు. ఆయా చట్టాలు హక్కుల పట్ల కార్మికులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. (14 సం॥రాల) లోపు బాల-బాలికలకు ఉచితంగా విద్యను అందించాలి, మైనర్ (18 సం॥రాలలోపు బాల బాలికనులు ఏ వాహనాలు నడుపకూడదు అలా నడిపిస్తే పిల్లలకు కాకుండా ఆ బండి యజమానికి శిక్ష పడుతుంది అన్నారు.పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయడం మరియు వారు ఆ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడం. పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటం మరియు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయడం గురించి తెలిపారు. మీకు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ప్రతి మహిళా మరియు సీనియర్ సిటిజన్స్ తో ఉండవలసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్ (24×7), 181 – మహిళా హెల్ప్‌లైన్, 15100 – NALSA ఉచిత న్యాయ సహాయం, 112 – అత్యవసర సేవ టోల్-ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ కుమార్, పంచాయతి సెక్రటరీ నిర్మల మరియు సీనియర్ న్యాయవాదులు దత్తాత్రేయ, ఆడేం శ్రీనివాసులు, సూర్య ప్రకాష్, నరేదర్ సాగర్, క్రాంతి కుమార్ మరియు పోలీస్ అధికారులు ఎస్ఐ రేవతి, సర్పంచ్ వెంకట్ రాములు గౌడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

