7tv focus : అస్సాంలోని గౌహతిలోని ఓ హోటల్ ప్రాపర్టీ విషయంలో జరిగిన ఫైరింగ్ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు ఒకరు పోలీసులు చెర నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో ప్రధాన నిందితుడు హతమైనట్లు పోలీసులు చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితుడిని కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 3.10 నిమిషాలకు గౌరిసాగర్ వద్ద ఎన్కౌంటర్ జరిగింది.మరో కేసులో శివసాగర్ జిల్లాకు అతన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్పీ పాపోరి చేతియా తెలిపారు. హోటల్ ఫైరింగ్ కేసులో ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఘనాకంట గగోయిని.. 2024 నాటి బ్యాంక్ ఫ్రాడ్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అయితే అక్కడకు అతన్ని తీసుకెళ్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రధాన నిందితుడు ఘనాకంట గగోయి .. శిక్షణ పొందిన షూటర్. రకరకాల ఆయుధాల్లో అతను నిపుణుడు.

