ఖమ్మం 7tv focus : పక్కా స్కెచ్ తో ముందస్తు ప్రణాళికలో భాగంగానే మారుతి రామారావును అంతమొందించేందుకు కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత, హర్షిణి డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మారుతి రామారావు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం సిపిఐ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. అప్పటికే సిపిఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్ రామారావుకు సుమారు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదేపదే తన డబ్బులు ఇవ్వాలని కోరాడన్నారు. ఇది మనసులో పెట్టుకుని రామారావుపై బెదిరింపులకు పాల్పడడం జరిగిందన్నారు. తనకు ప్రాణహాని ఉన్నదని గ్రహించిన రామారావు ఈ నెల 14న ఖమ్మం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తన ఆవేదన వెల్లబుచ్చడం జరిగిందన్నారు. కమలాకర్ అనే వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడన్నారు.

