నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ అభినందనలు
కాలనీ సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని సూచన
కుత్బుల్లాపూర్, జూన్ 25 (7టీవీ ఫోకస్): రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గురువారం జీహెచ్ఎంసీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్‌ను ఆయన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించిన పుప్పాల భాస్కర్, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో వెల్ఫేర్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. స్థానిక ప్రజలు, అసోసియేషన్ సభ్యులు సమన్వయంతో పనిచేస్తే రాజీవ్ గాంధీ నగర్‌ను ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంచల అజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. విక్రమ్, కోశాధికారి పి. సంపత్ రెడ్డి, కాలనీ ప్రముఖులు చింతకింది వెంకటేష్, మహిపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేష్ గౌడ్, రమేష్, సర్వన్, బ్రహ్మ, సుబ్బారావు, రాజేష్ కుమార్, సతీష్, టి. శ్రీనివాస్, అవినాష్, జి. రాజేందర్ రెడ్డి, సిహెచ్. అశోక్, ఎమ్. వేణుగోపాల్, షేక్ ముబిన్, టి. రవి కుమార్, ఫణీంద్ర, నవీన్, ఎన్. అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

