చింతలపూడి 7 టివి ఫోకస్ ఆగస్టు 10
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు బి. శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు కె.వి.ఎన్. ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఏలూరు జిల్లా ఏ. ఆవులయ్య ఆదేశాల ప్రకారం చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది మరియు ఏ సి ఎన్ఫోర్స్మెంట్ సిఐ పి ఎస్ డి భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరముల కొరకు జాయింట్ నిర్వహించగా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దేశవతులక్ష్మి అను మహిళ వద్ద నుంచి ఒక లీటరు నాటు సారాయిని స్వాధీనపరుచుకుని ఆ మహిళకు సంబంధించిన ముప్పై లీటర్ల పులిసిన బెల్లపు ఓటరు ధ్వంసం చేసి ఆ మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం అయినది అలాగే ఈరోజు చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బాణావతి రంగా మరియు వడిత్య దేవి మరియు రేచర్ల గ్రామానికి చెందిన ఇస్లావత్ దివ్య అను ముగ్గురును చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరువర్షగా 129 BNSS చట్ట ప్రకారం బైండోవర్ బాండ్ విధించినారు అలాగే ఈరోజు చింతలపూడి మండలంలో గల పాలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సురక్ష యాప్ ద్వారా మద్యం విక్రయాలు జరపాలని నౌకరినామాదారులకు తగు సూచనలు జారీ చేసినారు ఈ కార్యక్రమాలలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ. జె. జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ. పి. అశోక్ తెలిపారు

