7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూలై 6: బాలాజీనగర్ డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమం పరిశీలన – హాస్టల్ విద్యార్థుల ఓటరు నమోదుపై సందిగ్ధత తొలగించాలని సూచన కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో హాస్టళ్లలో నివసించే ఓటర్ల నమోదుపై స్పష్టత అవసరమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలతో కలిసి ఏఈఆర్ఓ శ్రీనివాస్‌తో బాలాజీనగర్ డివిజన్లో ఓటర్లకు అవసరమైన ఫారాలను పంపిణీ చేశారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ, ఒకో హాస్టల్లో సుమారు 70 మంది వరకు నివసిస్తున్నారని, వారికి ఓటరు ధ్రువీకరణ పత్రాల పంపిణీలో కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు. హాస్టళ్లలో ఉండే వారికి కూకట్‌పల్లిలో ఓటు హక్కు ఉందా, లేక వారి స్వస్థలాల్లోనే కొనసాగుతుందా అనే అంశంపై అధికారులు పరిశీలన నిర్వహించి, అర్హులైన వారికి బీఎల్ఓల ద్వారా ఫారాలు అందజేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కూకట్‌పల్లిలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల సెటిలర్ల ఓటు నమోదు అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నియోజకవర్గంలోని తుది ఓటర్ల సంఖ్యపై పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూము వేణు, సతీష్ రెడ్డి, దేశాల్, రాజేష్ గౌడ్, నాగార్జున, మైకేల్, ఫణికుమార్, నలినీకాంత్, రాజు, రమణ, రవి, గోపాల్ చౌదరి, సంధ్య, రజిత, వనజ, సుజాత, వాణి తదితరులు పాల్గొన్నారు.

