7టీవీ ఫోకస్, షాద్‌నగర్, జూలై 6: షాద్‌నగర్‌లో 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – దళిత, బహుజనుల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడిన కాంగ్రెస్ నాయకులు భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 41వ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు జాంగారి రవి ఆధ్వర్యంలో బ్లాక్ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం మాట్లాడుతూ, దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, కార్మిక, వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా సేవలందించిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ దళిత, బహుజనుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. చైనా, పాకిస్థాన్ యుద్ధాల సమయంలో రక్షణ శాఖ మంత్రిగా దేశ భద్రతకు కీలక సేవలందించారని పేర్కొన్నారు. ఫరూఖ్‌నగర్ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, ఆహార కొరత సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన బాబు జగ్జీవన్‌రామ్ దేశ ఆహార భద్రతకు పునాది వేసిన మహనీయుడని అన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు ద్వారా దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాధేపల్లి సిద్ధార్థ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల సాధనకు రాజ్యాంగపరమైన మార్గం చూపితే, ఆ హక్కులు అమలయ్యేలా పాలనలో కీలక పాత్ర పోషించిన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ తాలూకా మాజీ అధ్యక్షుడు కరోళ్ల సురేందర్ మాట్లాడుతూ, దేశ రాజకీయ, సామాజిక నిర్మాణంలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని, రిజర్వేషన్ విధానం అమలుకు ఆయన చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు జాంగారి రవి మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాధేపల్లి సిద్ధార్థ, కరోళ్ల సురేందర్, తుపాకుల శేఖర్ ముదిరాజు, సర్పంచ్ రమేష్, వావిలాల సుజీవన్, జాంగారి జంగయ్య, రవితేజ, బొరిగే నరేందర్, త్రిప్పిశెట్టి కర్ణాకర్, ఎం. జనార్ధన్, నక్క బాలరాజు యాదవ్, అర్జున్ కుమార్, నర్సింహులు, పోలే శ్రీహరి, సింగపగ జంగయ్య, సీతారాం, కృష్ణ, మహేందర్, గడ్డం జంగయ్య, చాకలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

