కుత్బుల్లాపూర్: భారతీయ జనతా యువమోర్చా (BJYM) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఘన విజయం సాధించింది. IDPL X రోడ్ నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 4,000 మంది విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ డి. గిరి వర్ధన్ రెడ్డి గారు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఉత్సాహాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎస్. మల్లారెడ్డి గారు, కొల్లి మాధవి గారు, తాదూరి శ్రీనివాస్, కాంతారావు, శేఖర్ యాదవ్, రావుల శేషగిరి, విఘ్నేష్, నల్ల జై శంకర్ గౌడ్, వేముల రమేష్, గారిగే శేఖర్, పులి బలరాం, సుబ్బారావు, నందనం దివాకర్, రాజా సదానందం, రాజేష్ చారి, ఝాన్సీ, నాగదీప్, శ్యామ్ కిరణ్ రెడ్డి, శ్రీనాథ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.ర్యాలీలో విద్యార్థులు, యువత చూపిన ఉత్సాహం, క్రమశిక్షణ, దేశభక్తి అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి, యువతకు హృదయపూర్వక అభినందనలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే ర్యాలీ విజయవంతం కోసం కృషి చేసిన BJYM వాలంటీర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సమిష్టి కృషి వల్లే ఈ తిరంగా ర్యాలీ ఇంత ఘన విజయాన్ని సాధించింది.
దేశభక్తి మన గుండెల్లో…
తిరంగా మన చేతుల్లో… 🇮🇳
భారతమాత మన హృదయాల్లో… 🇮🇳
జై హింద్ 🇮🇳
భారత్ మాతాకీ జై 🇮🇳
ఇట్లు,
BJYM – కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

