సామాజిక సేవలో భాగంగా సామాన్య ప్రజలకు ఉచిత వైద్య సేవలు – గోగులపాటి కృష్ణమోహన్
సూరారం, ఆగస్టు 13:
మేడ్చల్ జిల్లా, సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవన్లో నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ జన్మదినం సందర్భంగా సీఎమ్మార్ హాస్పిటల్, కండ్లకోయ వారి సౌజన్యంతో నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో **ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, నా ఫౌండేషన్ మరియు నా టీవీ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ, “సాహిత్యస్య వికాసాయ, రక్షణాయ చ సంస్కృతేః | సామాజిక హితార్థాయ, నా సంస్థా వర్తతే చిరం ||” అనే ధ్యేయంతో సాహిత్య వికాసం, సామాజిక శ్రేయస్సు, సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలుగా నా ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సామాజిక సేవ, సాహిత్య వికాసం, సాంస్కృతిక పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా నా ఫౌండేషన్ తన వంతు కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. సామాన్య ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు కృష్ణమోహన్ తెలిపారు. శిబిరంలో సుమారు 100 మంది వరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు 25 మందికి రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు, వైద్య సేవలు పొందిన వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసబుల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజయ్య, సీఎమ్మార్ హాస్పిటల్ పీఆర్వో దుర్గాప్రసాద్, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారు రమేష్ సర్వేపల్లి, సంఘం సభ్యులు గడ్డం రాంబాబు, శ్రీధరాచార్యులు, నరేందర్ రెడ్డి, యాదయ్య, రాము, శేఖర్ గౌడ్, సీఎమ్మార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రవల్లిక, కోఆర్డినేటర్ రాజ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.

