పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన
జూమ్ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 14: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంతో పాటు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకాలు, కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులకు సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం నిర్వహించిన జూమ్ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం, వారికి శిక్షణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీకి చెందిన యువజన ప్రతినిధులు, బూత్ స్థాయి ప్రతినిధులు ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ ఓట్ల తొలగింపు, అర్హులైన ఓటర్ల నమోదు వంటి అంశాల్లో చురుకుగా వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకాలు, సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల ఏర్పాటు పురోగతిపై రాష్ట్ర నాయకత్వానికి వివరించారు.ఈ జూమ్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంట్ స మన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

