తుగ్గలి, జూలై 31 ( 7 టీవీ ఫోకస్ న్యూస్)
మద్దికెర రాము, డీలర్ సుంకన్న ఆధ్వర్యంలో పగిడిరాయిలో శుక్రవారం “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టీడీపీ తుగ్గలి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ పెంపు, మహిళల సంక్షేమం, రైతు సంక్షేమం తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.అనంతరం బత్తిన వెంకటరాముడు, తిరుపాల్ నాయుడు గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొమ్ము వెంకటేష్, బి.సి. వెంకటస్వామి, చంద్రశేఖర్ యాదవ్, దామోదర్, నక్కల రమేష్, చిన్న గుండమయ్య, మొట్టి సంజన్న, రంగయ్య ఆర్ఎంపీ, మాజీ సర్పంచ్ గుండమయ్య, నాగార్జున, పక్కిరప్ప, చక్రపాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

