పద్మానగర్‌లో రూ.28 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభం.. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
పద్మానగర్‌లో రూ.28 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభం.. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 7: ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. 285వ పద్మానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్-2లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పాదయాత్ర నిర్వహించిన ఆయన, స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. పాదయాత్ర సందర్భంగా రోడ్ నెం.24లో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం కాలనీలో పర్యటిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తాగునీటి సరఫరాలో లో-ప్రెషర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తెలంగాణ చౌరస్తా వద్ద మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, తెలంగాణ చౌరస్తా వద్ద మురుగునీరు ఓవర్‌ఫ్లో కాకుండా నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి కాలనీలో అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ అభిరామ్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, బొంబాయి శీను, రాకేష్ జాలిగం, మధుకర్ రెడ్డి, ఎం.డి. నజీరుద్దీన్, రమణారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్, దుర్గారెడ్డి, కళ్లెం శ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు శౌరి రాజ్, కేదార్ నాథ్, వెంకట్ సాయి, దశరథ్, రామ్‌దాస్, సంతోష్, ఏలా నగేష్ తదితరులు పాల్గొన్నారు.

