7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 10: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న సీతక్క నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిబిడ్డగా, నిరుపేదల గొంతుకగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన సీతక్క నేడు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకురాలిగా నిలిచారని అన్నారు.

పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే సేవాతత్పరత సీతక్క ప్రత్యేకత అని కొనియాడారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణాభివృద్ధి, తాగునీటి సదుపాయాల విస్తరణ, మహిళా–శిశు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె విశేష కృషి చేశారని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న సీతక్క సేవలు రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ గుంజ రేణుక నారాయణ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

