7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట డివిజన్ లక్ష్మీ గణపతి ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 7వ వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట డివిజన్ పరిధిలోని లక్ష్మీ గణపతి ఎన్‌క్లేవ్‌లో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 7వ వార్షికోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ కృష్ణ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ కృష్ణను శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోల్తూర్ మల్లేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు అధ్యక్షుడు శంభీపూర్ సుదర్శన్, కాలనీ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, నాయకులు రాజశేఖర్ యాదవ్, ఆకుల అశోక్, మచ్చేందర్, జితేందర్ రెడ్డి, యాదగిరి, రాజు, మల్లేష్, బాలరాజు, శ్రీశైలం, వీరస్వామి, సదానందం, శ్రీను, ప్రభు, యాకూబ్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, రాంబాబు, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

