జిల్లా కేంద్రంలో ఆస్పత్రి లేక పోవడంతోనే విద్యా ర్థి మృతి
కుటుంబాన్ని ఆదుకో వాలి
బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావునామాజీ,,,,7,,టీవీ న్యూస్ ఫోకస్,,,
బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావునామాజీ,,,,7,,టీవీ న్యూస్ ఫోకస్,,, నారాయణపేట ఆగస్టు 7;8/2026/ నారాయణపేట మండల ఏక్లాస్పూర్ ప్రభుత్వ పాఠ శాలల్లో పాముకాటుకు మృతి చెందిన 3తరగతి చదువుతున్న రంజిత్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు.స్థానిక అప్పంపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి లో సరైన చికిత్స అందక వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోవడం ఎంతో దిగ్భ్రాంతి కలిగించిం దన్నా రు.శుక్రవారం నారాయణ పేట జిల్లా బిజెపి అధ్య క్షుడు సత్య యాదవ్ ఏక్లాస్ పుర్ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్, బీజేపీ జిల్లా ఆఫీస్ సెక్రెటరీ సాయి బన్న, మీడియా కన్వీనర్ కిరణ్ డగే లప్ప అశోక్ ముఖ్య నాయకులు గ్రామస్తులతో కలిసి విద్యార్థి భౌతికకాయాన్ని నారాయణపేట లో ఉన్న పోస్టుమార్టం సెంటర్ లో సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.విద్యార్థి తండ్రిని కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో సరైన సమయంలో చికిత్స అంద కపోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. అప్పక్ పల్లిలో ఉన్న జిల్లా ఆస్పత్రిలోనూ విద్యా ర్థికి సకాలంలో చికిత్స అందించక పోవడంతో మృతి చెందాడని ఇది డాక్టర్ల నిర్లక్షమని అన్నారు. ప్రభు త్వ నిర్లక్ష్యంతో చని పోయిన ఆ విద్యార్థి కుటుం బానికి ప్రభుత్వం పదిలక్షల ఎక్సగ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజలకోసం వారి ఆరోగ్యంకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు