7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూన్ 27: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు. ఓటరు జాబితా సమగ్ర పరిశీలనకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఇతర అధికారులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించి, ఎమ్మెల్యేకు కూడా ఎన్యూమరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించి తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు కొద్దిసమయం కేటాయించి తన ఓటు హక్కును పరిరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పరిశీలన సందర్భంగా అధికారులు కోరిన వివరాలను అందిస్తూ సహకరించాలని సూచించారు. ఎవరైనా ఎస్ఐఆర్ ప్రక్రియపై సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఎస్ఐఆర్కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా తన కార్యాలయాన్ని లేదా 93941 15559 నంబర్‌ను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి గజ్జెల నగేష్‌తో పాటు పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

